శాంసంగ్‌ ఫ్లిప్‌ ఫోన్‌ : హై-ఎండ్‌ స్పెషిఫికేషన్లు



శాంసంట్‌ ఎట్టకేలకు తన ఫ్లిప్‌​ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. చైనా వేదికగా డబ్ల్యూ2018 ఫోన్‌ను శాంసంగ్‌ ఆవిష్కరించింది. హై-ఎండ్‌ స్పెషిఫికేషన్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి వచ్చినట్టు తెలిసింది. దీన్ని ధరను కంపెనీ వెల్లడించలేదు. కానీ 2000 డాలర్ల(రూ.1,29,041) మేర ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఎలిగెంట్‌ గోల్డ్‌, ప్లాటినం రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది.
శాంసంగ్‌ డబ్ల్యూ2018 ఫ్లిప్‌ ఫోన్‌ ఫీచర్లు...4.2 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ ఫ్రంట్‌ డిస్‌ప్లే
4.2 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ఇన్నర్‌ డిస్‌ప్లే
గొర్రిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌

స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌

6జీబీ ర్యామ్‌,
ఎక్స్‌ట్రీమ్‌ ఎడిషన్‌కు 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, కలెక్టర్‌ ఎడిషన్‌కు 256జీబీ స్టోరేజ్‌
ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌
12 ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా
2300 ఎంఏహెచ్‌ బ్యాటరీ
యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌
శాంసంగ్‌ గత పదేళ్లుగా డబ్ల్యూ సిరిస్‌ స్మార్ట్‌ఫోన్లను చారిటీ ఫండ్స్‌ కోసం లాంచ్‌ చేస్తోంది. కొత్తగా తీసుకొచ్చిన ఈ డబ్ల్యూ2018 ఫ్లిప్‌ ఫోన్‌ 10వ వార్షికోత్సవ ఎడిషన్‌ ఫోన్‌.

No comments

Powered by Blogger.