నోకియా ఫస్ట్‌ హై ఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌.. త్వరలో


స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో హవా చాటాలని ప్రయత్నిస్తున్న నోకియా త్వరలోనే అత్యంత శక్తివంతమైన  మొబైల్‌ను  భారతీయ మార్కెట్లో విడుదల చేయనుంది. ఇప్పటికే గ్లోబల్‌ మార్కెట్‌లో లాంచ్‌ అయిన మొట్టమొదటి హై ఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌  నోకియా 8 ను  సెప్టెంబర్‌  26వ తేదీన  విడుదల చేస్తోంది.  న్యూఢిల్లీలో నిర్వహించే ఓ స్పెషల్‌ ఈవెంట్‌లో దీన్ని భారతీయ వినియోగదారుల ముందుకు తీసుకురానుంది.  ఇందులో డ్యుయల్‌ రియర్‌ కెమెరా విత్‌ డబుల్‌ సెన్సర్‌( ఒకటి కలర్ సెన్సార్, రెండవది మోనోక్రోమ్ సెన్సార్) అమర్చినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. శాంసంగ్‌ గెలాక్సీ  ఎస్‌8, ఎస్‌ 8ప్లస్‌ లోవాడిన క్వాల్కం స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌ తో రూపొందించింది.  ఇండియాలో దీని ధర  సుమారు రూ.45 వేల ఉండొచ‍్చని అంచనా.
నోకియా 8 ఫీచర్లు
5.3 అంగుళాల డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌
4జీబీ ర్యామ్‌
64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌,
256 జీబీ దాకా విస్తరణ అవకాశం
13+13  ఎంపీ రియర్‌ డ్యూయల్‌ కెమెరా
13 ఎంపీ సెల్ఫీ కెమెరా
 3090 ఎంఏహెచ్‌ బ్యాటరీ

No comments

Powered by Blogger.