Airtel Free Offer

                 AIRTEL FREE 60GB DATA
ఎయిర్‌టెల్‌ తన మాన్‌సూన్‌ ఆఫర్‌ ముగియడానికి వస్తున్న క్రమంలో పోస్టు పెయిడ్‌ కస్టమర్లకు మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. కొత్తగా మరో ఉచిత డేటా ఆఫర్‌ను తన ప్రీపెయిడ్‌ కస్టమర్లకు అందించనున్నట్టు తెలిపింది. ఈ కొత్త ప్లాన్‌ కింద యూజర్లు ఆరు నెలల పాటు 60జీబీ ఉచిత డేటాను పొందనున్నారు. అయితే ఈ ఆఫర్‌ను పొందడానికి యూజర్లు తొలుత ఎయిర్‌టెల్‌ టీవీ యాప్‌ను తమ ఫోన్లలోకి డౌన్‌లోడ్‌ చేసుకుని, ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రక్రియ పూర్తయితే, 24 గంటల్లో ఈ ఉచిత 60జీబీ డేటా ప్రయోజనాలు యూజర్లకు క్రెడిట్‌ అవుతాయి. నెలకు 10 జీబీ చొప్పున ఆరు నెలల పాటు మొత్తం 60జీబీ డేటాను యూజర్లు పొందుతారు. ఈ ఆఫర్‌ కేవలం ఎయిర్‌టెల్‌​ పోస్టుపెయిడ్‌ కస్టమర్‌, మైఎయిర్‌టెల్‌ యాప్‌ యూజర్లకు మాత్రమేనని కంపెనీ తెలిపింది. ఇప్పటి వరకు మై ఎయిర్‌టెల్‌ యాప్‌ లేని వారు కూడా గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా కంపెనీ సూచించింది.

       
ఈ ఆఫర్‌ను ఎలా యాక్టివేట్‌ చేసుకోవాలి....
తొలుత మైఎయిర్‌టెల్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలిఫ్రీ డేటాను క్లయిమ్‌ చేసుకునే ప్రక్రియ బ్యానర్‌గా కనిపిస్తూ ఉంటుందిఆ బ్యానర్‌ను క్లిక్‌ చేయాలిస్క్రీన్‌పై కనిపించే సూచనలను పాటిస్తూ వెళ్లాలిఎయిర్‌టెల్‌ టీవీ ఏపీకే అని వస్తుంది, దాన్ని మీ స్మార్ట్‌ఫోన్లలోకి ఇన్‌స్టాల్‌ చేసుకోవాలియూజర్లు దీన్ని విజయవంతంగా డౌన్‌లోడ్‌ చేసుకున్నాక, ఉచిత డేటా 24 గంటల్లో క్రెడిట్ అవుతుంది

No comments

Powered by Blogger.